TDP Leader Nara Lokesh Comments at Yuvagalam Padayatra in Vijayawada: రాబోయే చంద్రన్న ప్రభుత్వంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వెల్లడించారు తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న నారా లోకేష్ పాదయాత్ర.. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదివారం సాయత్రం ప్రారంభమైంది. యువనేత లోకేష్ కు మద్దతు ఇస్తూ యువతీ యవకులు భారీగా రోడ్లపైకి తరలి వస్తున్నారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజలు లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు మోయ లేని విధంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తారు. మరికొద్ది రోజుల్లోనే చంద్రన్న ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిస్కరిస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిస్తామని చెప్పారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇసుక అందుబాటులేక అవస్థలు పడుతున్నామన్న నగరవాసులు తెలిపారు లోకేష్.
భవిష్యత్తుకు గ్యారంటీ కర పత్రాలను ప్రజలకు పంచుతూ వాటి ప్రయోజనాలను వివరిస్తున్నారు లోకేష్. యువనేతను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడుతున్న యువతీయువకులు, మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లతో ఫోటోలు దిగారు. రోడ్డు డివైడర్లు, భవనాలపైకి ఎక్కి యువనేతకు అభివాదం చెబుతున్న నగర ప్రజలను చెయ్యి ఊపి పలకరిస్తూ ముందుకు వెళ్తున్నరు నారా లోకేష్.
విజయవాడ తూర్పు నియోజకవర్గం డీవీ మేనర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా ముస్లింలు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారితో లోకేష్ మాట్లాడుతూ.. జగన్ ముస్లింల ఆస్తులు, ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధ లేదని విమర్శించారు. వేల కోట్ల రూపాయల వక్ఫ్ ఆస్తులను వైసీపీ దొంగలు అడ్డగోలుగా దోచుకున్నారని మండిప్డడారు. మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.5 వేల కోట్లను కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక గతంలో అమలు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ నారా లోకేష్ పునరుద్ధరిస్తామన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా పేద ముస్లింలందరికీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. పేద ముస్లింలకు ఆర్థిక చేయూతనందించేందుకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు లోకేష్. తెలుగు దేశం పార్టీ పాలనలో ప్రవేశ పెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందని ఫైర్ అయ్యారు. విదేశీ విద్య, దుల్హన్ పథకాలను రద్దు చేశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్.
”విజయవాడలో రెండవ హజ్ హౌస్, ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలి. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూతనివ్వాలని చెప్పారు లోకేష్. మసీదుల రిపేర్లు, షాదీ ఖానాల నిర్మాణలు చేయాలని, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ను కొనసాగించాలన్నారు. రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, దుకాన్-మకాన్ పథకాలను పునరుద్ధరించాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులతో పాటు ముస్లింలకు రక్షణకు చర్యలు తీసుకోవాలని” నారా లోకేష్ ను కోరుతూ వినతి పత్రం అందజేశారు ముస్లిం నేతలు.