Tata to Make iPhones: ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్కు పునాదులు వేసిన టాటా(TATA) సంస్థ.. మరో ముందడుగు వేసింది. మొబైల్ దిగ్గజంతో జత కట్టింది. యాపిల్ ఐఫోన్ల(Apple iPhone) తయారీలో ఇకపై టాటా భాగం కానుంది. బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి విస్ట్రాన్ కార్ప్ ఆమోదం కోసం కేంద్రం వెయిట్ చేస్తోంది. ఆమోదం లభించిన వెంటనే టాటా గ్రూప్ త్వరలో దేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. రెండున్నరేళ్లలో తయారీ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. విస్ట్రోన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ (Wistron Infocomm Manufacturing )ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను టాటాకు 125డాలర్ల మిలియన్లకు విక్రయించనుంది. రెండు గ్రూపులు తమ ఒప్పందాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కంపెనీలు రెగ్యులేటరీ అనుమతులను కోరుకుంటాయి.
TATA Electronics Private Limited to take over Wistron Infocomm Manufacturing (India) Private Limited.
Increased job creation
Increased quality@Apple #iPhone@RNTata2000@TataCompanies #TataGroup #Iphone #manufacturing pic.twitter.com/ENlSUN8XsU
— Investors Central (@Investorscen) October 28, 2023
టాటా టాప్:
టాటా సంస్థ దాదాపు అన్ని రంగాల్లోనూ భారతదేశమంతటా ఉంది.. దేశానికి కార్పొరేట్ కల్చర్‌ను నేర్పిన సంస్థ టాటా. ఉప్పు దగ్గర ఉంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, ఎయిర్‌లైన్స్ ఇలా దాదాపు ప్రతీరంగంలోనూ టాటా తన సత్తా చూపించింది. దేశంలోని కీలక సంస్థల్లో టాటా ఒకటి. ఈ సంస్థ నుంచి మనకు రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుంది. దేశం గర్వించే ఎన్నో పనులు చేసిన సంస్థగా ప్రజల్లో టాటాకు మంచి పేరు ఉంది. ఈ సంస్థను అందరూ గౌరవిస్తారు. అలాంటి టాటా ఐఫోన్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుండడం పట్ల ఇండియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు
PM @narendramodi Ji’s visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports.
Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023
చైనాతో గొడవలు:
అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కాలంలో ఈ వార్ పీక్స్‌కు వెళ్లింది. నిజానికి ఐఫోన్ తయారీ చైనాలో జరుగుతుంది. ఇది చైనాకు ఆర్థికంగా ఎంతగానో హెల్ప్ అవుతుంది. అందులోనూ అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా.. ఐఫోన్ తయారీలో మాత్రం చైనాపై ఆధారపడిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కొంతకాలంగా తైవాన్, ఇండియా లాంటి దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఇప్పుడు టాటాతోనూ మాట్లాడింది.
రాయితీలే కారణమా?
మరో నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారీ అయ్యే ఐఫోన్లలో 25శాతం భారత్ నుంచే ఉత్పత్తి అవుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాపడుతున్నారు. అంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి ఇండియాది అన్నమాట. నిజానికి ఇటీవల కాలంలో దేశంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణం. మేక్ ఇన్ ఇండియా స్కీంలో భాగంగా లోకల్‌గా ఉత్పత్తి అయ్యే మొబైల్స్‌కు కేంద్రం రాయితీలిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటున్నారు నిపుణులు. ప్రభుత్వం ఇన్సెంటీవ్స్ ఇస్తుంది కదా అని చెప్పి ఇక్కడ ఉత్పత్తి చేయడానికి వస్తే తర్వాత కేంద్రం రాయితీలు ఆపేస్తే కంపెనీలన్నీ వెళ్లిపోయే ప్రమాదముంది. అయితే అంతదూరం రాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటుందంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్!
Also Read: పాకిస్థాన్‌ను గెలిపించేందుకు చీటింగ్! బీసీసీఐ తొండాట..?