Air India New Logo: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత..ఇప్పుడు కొత్త లోగోను రీబ్రాండింగ్ కు వెళ్తోంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానాల్లో పేర్లు కొత్త స్టైల్లో కనిపిస్తాయి. టాటా గ్రూప్ (TATA Group) ఎయిర్ ఇండియా కొత్త లోగో.. బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో టాటా గ్రూప్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇప్పుడు ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ కొత్త పద్ధతిలో రాసి ఉంటుంది. అలాగే, కంపెనీ కొత్త లోగో విమానం వెనుక భాగంలో కనిపిస్తుంది.
కొత్త లోగోలో ఎరుపు, తెలుపుతోపాటు పర్పుల్ రంగును ఉపయోగించింది. టాటా గ్రూప్ చైర్మన్ ఈ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ..ఎయిర్ ఇండియా అంటేనాకు వ్యాపారం కాదని..ఫ్యాషన్ అన్నారు. టెక్నాలజీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ పై చాలా క్రుషి ఉంటుందన్నారు.ఈ పనికోసం ఎయిర్ ఇండియా తన అత్యుత్తమ గ్రూపును నియమించినట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా వైపు నుంచి ఫ్లీట్ లో చాలా పనులు జరగుతుండగా…విమానాల సంఖ్యను మరింత పెంచేందుకు పెద్దెత్తున ఆర్డర్లు ఇచ్చింది. డిసెంబర్ 2023 నుండి ప్రయాణీకులు తమ ప్రయాణాలలో కొత్త లోగోను చూస్తారని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ లోగో ఎయిర్‌లైన్ యొక్క మొదటి A350 విమానంలో ప్రదర్శించనున్నారు.
ఎయిర్ ఇండియాకు కొత్త లోగో వచ్చినంత మాత్రానా…దాని ఐకానిక్ ‘మహారాజా’ మస్కట్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎయిర్‌లైన్స్ దిగ్గజ మహారాజా మస్కట్ సజీవంగా ఉందని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. గతంలో మహారాజా నిష్క్రమణపై పుకార్లు అతిశయోక్తిగా ఉన్నాయని అన్నారు.సీఈఓ విల్సన్ మాట్లాడుతూ, “ఎయిరిండియాలో మహారాజా ఒక ముఖ్యమైన భాగం.. మేము భారతదేశ ప్రవాసులతో దీన్ని కొనసాగించాలనుకుంటున్నాము.”అని తెలిపారు.
జనవరి 2022లో ప్రభుత్వం నుంచి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి, విమానయాన సంస్థ యొక్క పునరుజ్జీవనం కోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో, ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ ,బోయింగ్‌లకు 470 విమానాల కోసం ఆర్డర్ కూడా చేసింది.
Also Read: ద్రవ్యోల్బణం ఎఫెక్ట్… రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!!