Tantra Movie OTT Release: ఈ మధ్య హర్రర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా వాటి పై విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు. ఇటీవలే హర్రర్ చిత్రాలుగా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’, ‘పిండం’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జానర్ లో వచ్చిన మరో హర్రర్ మూవీ ‘తంత్ర’.
Also Read: Chiranjeevi: “చూసుకోరు వెదవలు”.. వైరలవుతున్న మెగాస్టార్ కామెంట్స్..!
తంత్ర
శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో నటి అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంత్ర’. క్షుద్రపూజలు, హర్రర్ ఎలిమెంట్స్ తో మార్చి 15న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పూర్తి స్థాయి హర్రర్ మూవీగా మంచి రివ్యూలు కూడా పొందింది. కథ పరంగా మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని టాక్.
తంత్ర ఓటీటీ రిలీజ్
అయితే ఇప్పటివరకు థియేటర్స్ లో భయపెట్టిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ప్రముఖ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది ఆహా. “తంత్రం మంత్రం కుతంత్రం..☠️ ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం” అంటూ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించగా.. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బీదవే( BeTheWay) ఫిల్మ్స్ బ్యానర్స్ పై రవి చైతు, నరేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తంత్రం మంత్రం కుతంత్రం..☠️
ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం!🎬#Tantra Premieres April 05 @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopisetti @RaviChaith #NareshbabuP @firstcopymovies @BeTheWayFilms @TantraTheMovie pic.twitter.com/bRJqdHUS87— ahavideoin (@ahavideoIN) March 31, 2024
Also Read: Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!