Nagabhushan: కన్నడ సినీ నటుడు నాగభూషణ్ అరెస్టు అయ్యాడు. బెంగళూర్‌లో గత శనివారం ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఫుట్‌పాత్‌పై నడుస్తున్న దంపతులను ఢి కొట్టాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూర్‌లో శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో నటుడు నాగభూషణ్ ఉత్తరహళ్లి నుంచి కొననకుంటె వైపు వెళుతున్నారు. ఆయన కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వసంతనగర్ మెయిన్ రోడ్డుకు సమీపంలో వాకింగ్ చేస్తున్న జంటను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ ప్రేమ (48) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె భర్త కృష్ణ (58)కు సైతం బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్న పొందుతున్నారు. కాగా, గాయపడిన జంటను నాగభూషణ స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు.
నాగభూషణ్‌పై కుమారస్వామి ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వేగంగా కారు నడిపినట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. మద్యం తాగి కారును నడిపారా అనేది నిర్ధారించేందుకు రక్తం సాంపుల్స్ తీసుకుని ల్యాబ్ టెస్ట్‌కు పంపించామని, బ్రీత్ అనజైలర్ ప్రకారం ఆయన మద్యం తీసుకున్నట్టు నిర్ధారణ కాలేదని ట్రాఫిక్ సౌత్ డీసీపీ శివప్రకాష్ తెలిపారు. కారును స్వాదీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
నాగభూషణ్ ఇటీవల ‘కౌసల్య సుప్రజ రామ’ చిత్రంలో నిటించారు. ‘ఇక్కత్’ అనే చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన ఉత్తమ నూతన నటుడు అవార్డును అందుకున్నారు. ‘బడవ రాస్కేల్’ చిత్రంలో ఉత్తన సపోర్టింగ్ నటుడిగా నామినేట్ అయ్యాడు.
Also Read: అప్పుడే రెండు నెలలు అయిపోయింది..ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా ఎమోషనల్ పోస్ట్..!