Mid Air Collision Between Delta And American Airlines : ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం (Flight Accident) తృటిలో తప్పింది. రెండు విమానాలు ఆకాశంలో ఒకదాని దగ్గరికి ఒకటి రావడంతో అవి రెండు ఢీకొట్టుకుంటాయా అనేంత ఉత్కంఠ కలిగింది. ల్యాండ్ అవుతున్న ఓ విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఒక్కసారిగా ఢీకొట్టుకోబోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది.
అమెరికా (America) లోని న్యూయార్క్ లో సిరక్యూస్ హాన్ కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జులై 8వ తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన 2 విమానాలు ఢీ కొట్టుకోబోయాయి. ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ లో కంట్రోలర్లు ముందుగా అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్ లైన్స్ లో పాల్గొన్న బొంబార్డియర్ CRJ – 700ను రన్వే 28 లో ల్యాండ్ కావడానికి అనుమతినిచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటకే అధికారులు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో సీజ్ 700కి అదే రన్వే నుండి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు.
NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport.
A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane.
The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM
— Collin Rugg (@CollinRugg) July 10, 2024
దీంతో ఈ 2 విమానాలు ఆకాశంలో ఒక్కసారిగా చాలా దగ్గరకు వచ్చాయి. ఆ సమయంలో ఆ 2 విమానాలు ఢీకొట్టుకునేంత పని అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ ప్రకారం.., 2 విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700 నుండి 1000 అడుగుల దూరంలోకి రాసాగాయి. ఆ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా., మరో విమానం అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో కూడా 75 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక మొత్తానికి అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Also read: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు!