ఆలనాటి అందాల తార జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 లలో ఆమె అందరి అగ్రహీరోలతో నటించి మెప్పించింది. తెలుగు మాత్రమే కాకుండా ఆమె హిందీలో కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఛానెలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికీ ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ క్రమంలోనే జయప్రద గురించి ఎన్నో విమర్శలు సినీ ప్రపంచంలో వినిపించాయి. వాటిలో ఓ బాలీవుడ్ స్టార్ నటుడ్ని ఆమె చెంప దెబ్బ కొట్టిందనే వార్త. ఇంతకీ ఆ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు దాలిప్ తాహిల్. ఆయన బాలీవుడ్ లో స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు.
Also read: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్..ఎమ్మెల్సీ పదవికి ఆ నేత రాజీనామా!
జయప్రద తో ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఆమె ఆయన చెంప పగల కొట్టినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తల పై నటుడు తాహిల్ స్పందించారు. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…జయప్రద తనను చెంప పగలకొట్టిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
“జయప్రద అంటే నాకెంతో గౌరవం. ఆమె ఒక అందమైన నటి. ఓ సినిమా సెట్లో ఆమె నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వచ్చిన వార్తలు చూసి నేను ఆశ్చర్యపోయా. ఇంతకీ ఆ సంఘటన ఏ సినిమా సెట్లో చోటుచేసుకుందో చెబితే నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే నేను ఇప్పటి వరకూ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్నదే లేదని ఆయన వివరించారు.
సినీ ప్రపంచంలో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా నేను ప్రతి నాయకుడి పాత్రల్లోనే ఎక్కువగా నటించాను. అందువల్ల విలన్ సన్నివేశాలు ఏమైనా ఉంటే అవి నాతోనే చిత్రీకరించేవారు. అలాంటి సీన్ ఏదైనా ఉంటే.. నాతోపాటు హీరోయిన్‌కి కూడా ముందే చెప్పమనేవాడిని. వాళ్లు ఓకే అంటేనే ఆ సీన్లో నటిస్తానని.. లేకపోతే చేయనని చెప్పేసేవాడిని. ఒకవేళ దర్శకుడు బలవంతం చేస్తే సెట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడిని.. నేనెప్పుడూ ఆమెతో నటించలేదు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.