Sreeleela: కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి.. కెరీర్ మొదలు పెట్టిన కొంత కాలంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీగా సాగుతున్న హీరోయిన్స్ లో ఒకరు ఈ బ్యూటీ. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు చిత్రం పెళ్లి సందడి తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాన్స్, నటనతో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
మొదటి సినిమాతోనే ఫుల్ పాపులరైన శ్రీలీల వరస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇటీవలే స్టార్ హీరో మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమాలో మాస్ డాన్స్ దుమ్మురేపింది.
Also Read: Namrata Birth Day: నమ్రతకు.. మహేష్ బాబు బ్యూటీఫుల్ విషెస్.. వైరలవుతున్న ట్వీట్
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించే శ్రీలీల తాజాగా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. పసుపు రంగు చీరలో.. హైలెట్ గా కనిపించే ముక్కు పుడక ధరించి.. చూపు తిప్పుకోలేని అందాలతో క్యూట్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
రీసెంట్ గా శ్రీలీల స్కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు చేసింది. నాలుగు సినిమాల్లో ఒకటి మాత్రమే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. స్కంద, ఆదికేశవ డిజాస్టర్లు కాగా.. గుంటూరు కారం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ నెక్స్ట్ సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.
శ్రీలీల సినిమాలు మాత్రమే కాదు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ బ్యూటీ యాక్టర్ కమ్ డాక్టర్. ప్రస్తుతం ఎం బీ బీ ఎస్ చివరి సంవత్సరం పూర్తి చేసుకుంటోంది.
Also Read: Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి