Sophia Leone Death : అడల్ట్ ఫిల్మ్ స్టార్(Adult Film Star) సోఫియా లియోన్(Sophia Leone) మృతి చెందింది. 26 ఏళ్ల సోఫియా తన అపార్ట్మెంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. సవతి తండ్రి మైక్ రొమెరో ఆమె మరణాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం మృతికి గల కారణాలు వెల్లడికాలేదు. సోఫియా 18 సంవత్సరాల వయస్సులో అడల్ట్ ఇండస్ట్రీ(Adult Industry) లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె జూన్ 10, 1997న అమెరికాలోని మయామిలో జన్మించింది. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇక సోఫియా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎప్పుడూ సంతోషంగా ఉంచేదని స్నేహితులు గుర్తు చేసుకోని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Our hearts are broken by the untimely and tragic passing of our beloved Sophia Leone. A beautiful spirit who touched many of us. RIP sweet angel and know how much we loved you. A gofund me has been started for her family. https://t.co/XrrXzRLEsw
— 101 Modeling (@101ModelingInc) March 9, 2024
సోషియా ‘101 మోడలింగ్'(101 Modelling) అనే మోడలింగ్ ఏజెన్సీతో అనుబంధం కలిగి ఉంది. సోఫియా అకాల మరణ వార్తను ఏజెన్సీ కూడా ధృవీకరించింది. సోఫియా లియోన్ అకాల, విషాద మరణంతో తమ హృదయాలు విరిగిపోయాయని ట్వీట్ చేసింది. మనలో చాలా మందిని తాకిన అందమైన ఆత్మ సోఫియా అని.. స్వీట్ ఏంజెల్ అని కొనియాడింది. సోఫియా ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పలేమని ట్వీట్ చేసింది.
Shopia’s last interview RIP at age 26 #SophiaLeone 💔
RIP Sophia Leone We Will miss You#SophiaLeone #ElvishYadav
pic.twitter.com/EPrYRUXcyX— 𝑫𝒆𝒗𝑨𝒔𝒉𝒊𝒔𝒉 (@D_Patel55) March 10, 2024
మూడు నెలల్లో నాలుగో మరణం:
మూడు నెలల్లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది నాలుగో మరణం. ఇలా వరుస పెట్టి అడల్ట్ స్టార్స్ మరణిస్తుండడం సోషల్ మీడియా(Social Media) లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఫిబ్రవరిలో కాగ్నీ లీ కేవలం 36 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుంది. ఇక జనవరిలో జెస్సీ జేన్ ఓక్లహోమాలో తన ప్రియుడు బ్రెట్ హాసెన్ముల్లెర్తో కలిసి చనిపోయి కనిపించింది. ఈ వార్త చాలా మందిని షాక్కు గురిచేసింది. ఇక అదే జనవరిలో తేనా ఫీల్డ్స్ తన ఇంటిలో చనిపోయింది.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి!