Solid Foods To six Months babies: సహజంగా పిల్లలకు 5 నెలల వరకు కేవలం లిక్విడ్ ఫుడ్స్ మాత్రమే ఇస్తారు. ఆరు నెలల దాటిన తర్వాత పిల్లలకు మరింత శక్తి కావాలి. దాని కోసం కేవలం లిక్విడ్ ఫుడ్స్ ఇస్తే సరిపోదు. అందుకని మెల్లిగా సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లలు సాలిడ్ ఫుడ్స్ తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ పండ్లను అందిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు పిల్లల జీర్ణక్రియ, ఎదుగుదల, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆరు నెలలు దాటిన పిల్లలకు ఈ పండ్లు ఇస్తే మంచిది.
యాపిల్
సాధారణంగా యాపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇది తినిపిస్తే త్వరగా కూడా జీర్ణం అవుతుంది. కానీ వీటిని ముక్కలుగా కాకుండా.. ఉడికించి దానిని మెత్తగా స్మ్యాష్ చేసి తినిపించాలి. నేరుగా ముక్కలు చేతికి ఇస్తే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.
Also Read: Ear Pain: చెవి పోటుకు ప్రధాన కారణాలేంటి? పెయిన్ రిలీఫ్ కోసం ఏం చేయాలి?
అవకాడో
దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది పిల్లలకు శక్తిని ఇవ్వడంతో పాటు శరీరంలో ఇతర పోషకాల శోషణకు కూడా ఉపయోగపడుతుంది. అవకాడో ను పిల్లలకు ప్యూరీ ఫార్మ్ లో అందిస్తే మంచిది.
బననా
అరటి పండులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ చిన్నారుల ఆరోగ్యంగా చేస్తాయి. వీటిని ఉడికించి లేదా స్మ్యాష్ చేస్తే ఇస్తే మంచిది. అరటి పండులోని ఫైబర్ పిల్లల్లో మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పీచ్
ఈ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్స్, పొటాషియం, బీటా కెరోటీన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. వీటిని చిన్న ముక్కలుగా లేదా ప్యూరీగా అందించాలి.
పిల్లలకు ఏదైనా కొత్త ఆహారాలు అలవాటు చేసే ముందు తప్పకుండా వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని ఆహారాల కారణంగా పిల్లలకు అలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే