Sania Mirza: భారత టెన్నిస్ క్రీడాకారిణి (Tennis Player) సానియా మీర్జా (Sania Mirza) విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో (SociaL Media) ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా కేవలం ఒకే ఒక్క పదం. ”రిఫ్లెక్ట్” (Reflect) అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె పెట్టిన మొదటి పోస్ట్ ఇది.
ఇంతకాలం సానియా , మాలిక్ లా ఖులా గురించి సానియా కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అయితే కొద్ది రోజుల క్రితం మాలిక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్న చిత్రాలు బయటకు వచ్చిన తరువాత సానియా మాలిక్ విడాకుల గురించి ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరికి ఖులా అయిపోయిందని తెలిపారు. ( ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇచ్చుకునే విడాకులను ఖులా అంటారు)
ఈ విషయం గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ఈ చర్చలను ఆపాలని వారు కోరారు. సానియా తన వ్యక్తిగత జీవితాన్ని, గోప్యతను మీరంతా గౌరవిస్తారని అనుకుంటున్నట్లు సానియా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మాలిక్ కు కొత్త జీవిత ప్రయాణం గురించి శుభాకాంక్షలు కూడా మీర్జా కుటుంబం తెలిపింది.
సానియా మాలిక్ 2010 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇజాన్ అనే బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం బాబు సానియా వద్దనే ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం మాలిక్ సానియాను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం సాగింది. అప్పటి నుంచి ఈ విషయం గురించి అటు సానియా కానీ, మాలిక్ కానీ విడాకుల గురించి స్పందించలేదు. ఇప్పుడు తాజాగా వీటి అన్నింటికి ముగింపు దొరికింది.
Also read: మోడీతో వేదిక పంచుకోనున్న నితీశ్ కుమార్!