Bihar : బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్ లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు (Sampark Kranti Express) జనరల్ బోగీలో పొగలు రావడంతో … ప్రయాణికులు ఒక్కసారి అరుస్తూ… కిందకి పరుగులు పెట్టారు. మంటలు వ్యాపిస్తున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు. దీంతో స్టేషన్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. రైలు ప్లాట్‌ఫారమ్‌పై నుంచి కదలిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకుంది.
గమనించిన లోకోపైలెట్ (Loco Pilot) వెంటనే రైలును ఆపేశారు. స్టేషన్లో మోహరించిన ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ సిబ్బంది వెంటనే ప్రజలు కిందకి దూకుతున్న రైలు బోగీ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడే విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ ఒక్కసారిగా లీకైనట్లు సిబ్బంది గుర్తించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే రైల్వే మెకానికల్ విభాగం కమిటీ అధికారులు స్టేషన్‌కు చేరుకుని ఘటన గురించి విచారణ మొదలు పెట్టారు. అంతా బాగానే ఉందని చూసి.. రైలును 10:30 గంటలకు ముజఫర్‌పూర్‌కు పంపించారు.
Also read: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్.. ఆమోదించిన జో బిడెన్!