Skin Care: ఎవరికైనా చర్మ సౌందర్యం చాలా ముఖ్యం. చర్మం కాంతివంతంగా, మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కొంత మందిలో డ్రై స్కిన్, పింపుల్స్, చర్మం పొడిబారడం సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలన్ని దూరం కావాలంటే డైలీ స్కిన్ కేర్ రొటీన్ తప్పనిసరిగా పాటించాలి. సమస్యలు ఉన్నవారు మాత్రమే కాదు ప్రతీ ఒక్కరికీ స్కిన్ కేర్ రొటీన్ చాలా అవసరం. డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకోండి..
స్కిన్ హైడ్రట్డ్ గా ఉంచడం
చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. చర్మం తేమగా ఉండడానికి నీళ్ళు బాగా తీసుకోవాలి. సరైన నీళ్ళు తీసుకోకపోవడం వల్ల చర్మం డ్రై అవ్వడం, వాడిపోయినట్లు కనిపించడం జరగుతుంది.
మాయిశ్చరైజర్ అప్లై చేయండి
ప్రతీ రోజు మీ చర్మ సునిత్త్వానికి సరిపోయే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. వాతావరణంలోని మార్పుల కారణంగా చర్మం పై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మాయిశ్చరైజర్ తప్పని సరిగా అప్లై చేయాలి. ఇది చర్మం పొడిబారడం సమస్య నుంచి కాపాడుతుంది.
సన్ స్క్రీన్
చాలా మంది సన్ స్క్రీన్ కేవలం బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎండాకాలంలో మాత్రమే వాడతారు. కానీ చల్లటి వెదర్ లో కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని Uv రేస్ నుంచి రక్షిస్తుంది. అందుకే ప్రతీ రోజూ సన్ స్క్రీన్ అప్లై చేయాలి.
క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్
ఎక్స్ఫోలియేషన్ అనేది చర్మంలోని మృత కణాలను తొలగించును. ప్రతీ రోజు మీ మొహానికి సరిపోయే క్లెన్సర్ తో మొహాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మంలోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను తొలగించి చర్మాన్ని ఉంచుతుంది.
హెల్తీ డైట్
చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి పుష్కలమైన పోషకాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
Also Read: Snoring: గురక సమస్యతో బాధపడుతున్నారా? ఈ హోం రెమెడీస్ ఫాలో అవ్వండి!