Singer Bhole New Song: సింగర్ భోలే షావలి బిగ్ బాస్ సీజన్ 7 లో (Bigg Boss 7 Telugu) కంటెస్టెంట్ గా అందరికీ పరిచయం. భోలే సింగర్ మాత్రమే కాదు సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్ కూడా. భోలే రవితేజ కిక్ 2 సినిమాలో సూపర్ హిట్ సాంగ్ మమ్మీ.. మమ్మీ పాడారు. ‘బంతి పూల జానకి’, ‘యమహా యమ’, ‘ధనలక్ష్మీ తలుపు తడితే’ పాటలకు సాహిత్యం కూడా రాశారు. అంతే కాదు భోలే పాడిన ఎన్నో ఫోక్ ఆల్బమ్స్ సూపట్ హిట్ అయ్యాయి. రీసెంట్ సాంగ్ “పాలమ్మిన.. పూలమ్మిన” సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల చల్ చేసింది. ఇక తాజాగా భోలే తన యు ట్యూబ్ ఛానెల్ భోలే అఫీషియల్ లో మరో కొత్త ఆల్బమ్ రిలీజ్ చేశారు.
Also Read: YS Sharmila : కుమారుడి వివాహంపై షర్మిల కీలక ప్రకటన.. రేపు ఇడుపులపాయకు కుటుంబ సమేతంగా..!
‘అత్తగారు పెట్టిన కొత్త వాచీ లెక్క’ ఫోక్ సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో సింగర్ భోలే, బిగ్ బాస్ ఫేమ్ శుభ శ్రీ (Subha Shree) కలిసి నటించారు. ఈ పాటకు కొరియోగ్రాఫర్, లిరిక్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ గా భోలెనే వ్యవహరించారు. యు ట్యూబ్ లో సాంగ్ రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. భోలే ఈ పాటకు సంబంధించి భోలే సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ చేయగా.. నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. భోలే రీల్ కాదు రియల్ లైఫ్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భోలే బిగ్ బాస్ తర్వాత ప్రేక్షకులలో మరింత పాపులర్ అయ్యారు. హౌస్ లో భోలే జర్నీ తక్కువే అయినప్పటికీ.. బయట మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. పాటలు, మాటలు, కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Also Read: January Release: సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే