Silver ETF: మనం సాధారణంగా బంగారం కొనడానికే ప్రధాన్యత ఇస్తాం. ఆభరణాలుగా అయినా. ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా బంగారాన్ని ఎక్కువగా ఎంచుకుంటాం. అయితే.. బంగారంతో పాటు వెండి కూడా ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. బంగారం లానే వెండి కూడా ఆభరణాలుగానూ.. పెట్టుబడి సాధనంగానూ ఎక్కువ మంది ప్రస్తుతం చూస్తున్నారు. వెండిలో ఇన్వెస్ట్ చేయడానికి డిజిటల్ మార్గాన్ని ఎక్కువమంది ఎంచుకుంటున్నారు. పెట్టుబడిదారులు సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే సిల్వర్ ఇటిఎఫ్‌ని ఇష్టపడుతున్నారు. దీని ద్వారా, వెండికి సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది గత ఒక్క సంవత్సరంలో 25% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఇప్పుడు మనం సిల్వర్ ఇటిఎఫ్ గురించి అర్ధం చేసుకుందాం.
ఈటీఎఫ్ అంటే ఏమిటో తెలుసుకుందాం..
వెండిని షేర్లలా కొనుగోలు చేసే సదుపాయాన్ని సిల్వర్ ఇటిఎఫ్(Silver ETF) అంటారు. ఇవి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్, వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు చేయవచ్చు. అక్కడే అమ్ముకోవచ్చు. వెండి ఇటిఎఫ్ బెంచ్‌మార్క్ స్పాట్ వెండి ధరలు కాబట్టి.. మీరు తాజా ధరల దగ్గరలోనే కొనుగోలు చేయవచ్చు. వెండి ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
Also Read: పీక్స్ లో మొబైల్ ఫోన్ల తయారీ.. భారత్ లో వేగంగా పెరుగుతున్న ఇండస్ట్రీ
తక్కువ పరిమాణంలో కూడా కొనుగోలు చేయవచ్చు: ETF ద్వారా యూనిట్లలో వెండిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో లేదా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా వెండిని కొనుగోలు చేయడం సులభం చేస్తుంది. 1 యూనిట్ సిల్వర్ ఇటిఎఫ్ ధర ప్రస్తుతం రూ. 100 కంటే తక్కువగా ఉంది. అంటే 100 రూపాయల లోపు డబ్బుతో ఇందులో పెట్టుబడి ప్రారంభించవచ్చు.
వెండి సురక్షితంగా ఉంటుంది: ఎలక్ట్రానిక్ వెండిని డీమ్యాట్ ఖాతాలో ఉంచుతారు. దీనిలో వార్షిక డీమ్యాట్ ఛార్జీలు మాత్రమే చెల్లించాలి. అలాగే దొంగతనాల భయం కూడా ఉండదు. భౌతిక వెండిని దొంగిలించే ప్రమాదం కాకుండా, దాని భద్రతపై ఖర్చు కూడా ఉంది.
ట్రేడింగ్ సౌలభ్యం: సిల్వర్ ఇటిఎఫ్‌లను ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణమే కొనుగోలు చేయవచ్చు మరియు విక్రయించవచ్చు. అంటే డబ్బు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు.
సిల్వర్ ఈటీఎఫ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
వెండి ఈటీఎఫ్‌ను కొనుగోలు చేయడానికి డీమ్యాట్ ఎకౌంట్ కలిగి ఉండటం అవసరం. దీనిలో, మీరు NSE లేదా BSEలో అందుబాటులో ఉన్న సిల్వర్ ETF యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. మీ డీమ్యాట్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఎకౌంట్ నుంచి సంబంధిత ఎమౌంట్ డెబిట్ అయిపోతుంది. Groww, Upstox మరియు Paytm వంటి యాప్‌ల ద్వారా మీరు ఉచితంగా డీమ్యాట్ ఎకౌంట్ ను తెరవవచ్చు. దీని తర్వాత మీరు మీకు నచ్చిన వెండి ఈటీఎఫ్‌ని ఎంచుకోవచ్చు.
Watch this latest Video: