YSRCP Manifesto to be Released in Siddham: ఇవాళ(ఫిబ్రవరి 18) అనంతపురంలో నిర్వహించే సిద్దం సభలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేయనున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ (మా నమ్మకం నీపైనే ఉంది జగన్’) అనే నినాదంతో ఈ పాట రూపొందింది. జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై మహిళలు, పురుషులు, వృద్ధులు లేదా యువతకు ఉన్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరికీ ఈ పాట నిక్షిప్తం చేసి, పునరుద్ఘాటిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ‘రావాలి జగన్ కావాలి జగన్’ పాటను విడుదల చేసింది. ఇక రానున్న ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోపై కూడా జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలతో పాటుగా అనేక మెరుగైన విధానాలను జగన్ వివరిస్తారని సమాచారం.
ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా?
అటు రైతులను తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు జగన్ మాస్టర్ స్ట్రోక్‌గా రూ.లక్ష వరకు పంట రుణమాఫీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక APSRTC బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా జగన్ మేనిఫెస్టోలో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణాలో కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొన్ని షరతులతో కూడి ఉండవచ్చు. అటు రాప్తాడు సభను పర్యవేక్షిస్తున్న వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు, అన్ని వర్గాల ప్రయోజనాలను విస్మరిస్తున్న మీడియాకు జగన్ గట్టి సందేశం ఇస్తారని తెలిపారు. ప్రజలు వివిధ పథకాల నుంచి లబ్ది పొందుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇక వైసీపీ ప్రభుత్వం నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పుకుంటోంది. గడిచిన ఐదేళ్లలో ప్రతి కార్యక్రమం, పథకం లబ్ధిదారుల ఇంటింటికీ చేరిందని భావిస్తోంది. అందుకే జగన్ చేసే కొత్త వాగ్దానాలను కూడా అమలు చేస్తారని ప్రజలు నమ్ముతారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read: మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్ శాంతి కుమారి
WATCH: