Shooting in US : అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. దక్షిణ కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని ట్రబుకో కాన్యన్లో జరిగిన కాల్పుల్లో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బైకర్ బార్ అనే ప్రదేశంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. బైకర్ బార్ మోటార్‌సైకిల్ రైడర్లకు వినోద కేంద్రంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరెంజ్ కౌంటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులపై కూడా దుండగుడు కాల్పులు జరపడంతో…పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తి రిటైర్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా పోలీసులు గుర్తించారు. అతను తనకు తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పుల జరిపినట్లు అనుమానిస్తున్నారు.
#BREAKING Cook's Corner Shooting: 5 killed, 6 hospitalized biker bar in Trabuco Canyon, #California.
For more news updates, follow us at @TheNewsTrending pic.twitter.com/3PH62T7HwL
— Breaking News (@TheNewsTrending) August 24, 2023
కాగా గత నెలలో జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక కమ్యూనిటీలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే నెలలో బాల్టిమోర్ లోని బ్లూక్లిన్ హోమ్స్ లో జరిగిన ఓ పార్టీలో యువతపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 28మందికి గాయాలయ్యాయి. అటు కాన్సాస్ లోనూ జరిగిన కాల్పుల ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఆగస్టు 6వ తేదీన వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అనకోస్టియా ప్రాంతంలో గుడ్ హోప్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా…నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
Also Read: తీవ్ర విషాదం..బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత..!!