బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బానిసలు, చెంచాగాళ్లతో నాకు పోలికేంటి…వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. పువ్వాడ అజయ్ చేసిన పనులు ఖమ్మం ప్రజలకు తెలుసన్నారు. నాకు మట్టి, ఇసుక తినే అవసరంలేదని..ప్రజలను చులకనగా చూసి కాంట్రాక్టుల మీద ఆధారపడేవారికి నాకు గురించి మాట్లాడే అర్హత లేదు. నా అరాచకాల గురించి ఎవరు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఈ పదేళ్లలో నామీద ఒక్కకేసు ఉందేమో చూపించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తోపు అన్న తుమ్మల పాలేరు టికెట్ కోసం కాంగ్రెస్ కు అమ్ముడుపోయాడు అంటూ ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు పువ్వాడ అజయ్. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పువ్వాడ షాకింగ్ కామెంట్స్ పూర్తి వీడియో చూడండి.