PM Modi Tweet : అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ని ఓడించి తీరుతా… హైదరాబాద్(Hyderabad) ఎంపీగా గెలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ(BJP) అభ్యర్థి మాధవీలత(Madhavi Latha). ప్రధాని మోదీ(PM Modi) తన గురించి ట్వీట్ చేయడం తన అదృష్టమన్నారు. ఫిరోజ్ ఖాన్ నాలాగా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి అని.. కాంగ్రెస్(Congress) అసవుద్దీన్ కి సపోర్ట్ చేయడం తెలంగాణ(Telangana) ప్రజల మనసుకి నొప్పి కలిగించి ఉంటుందన్నారు. కాంగ్రెస్ కు ఒక వ్యక్తిత్వం లేదా? అని ప్రశ్నించారు. రాజా సింగ్ సెక్యూరిటీ అడిగిన రోజు నేను రాజకీయాల్లో లేను అని చెప్పిన మాధవీలత.. ముస్లిం అభ్యర్థులు అని చూడకుండా ఎంఐఎం దాడులు చేస్తుందని ఆరోపించారు. తనకు కూడా అభద్రత ఉందన్న కారణంతోనే భద్రత కల్పించారన్నారు. మోదీ దేశాన్ని కట్టే తాపీ మేస్త్రీ.. మోదీ కట్టే దేశంలోనే కేసీఆర్ ఉన్నారంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. భద్రాచలానికి డబ్బులు ఇవ్వకుండా కేసిఆర్ ఒకే టెంపుల్ మీద ఎందుకంత ఇన్వెస్ట్ చేసారని ప్రశ్నించారు. కేసిఆర్ ఓడిపోయిన ఆయనకి తెలివి రాలేదంటూ ఆర్టీవీతో మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియోను చూడండి.
ఇది కూడా చదవండి: తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేటోళ్లు.. RTVలో రెచ్చిపోయిన జీవన్ రెడ్డి