Bigg Boss 7 Shobha Shetty Engagement: కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రతో ఫుల్ పాపులరైన శోభ శెట్టి.. బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ లో తన ఆట తీరుతో లేడీ పటాకగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే ఈ నటి కార్తీక దీపం సీరియల్ లో తన కో యాక్టర్ యశ్వంత్ రెడ్డితో (Yashwanth Reddy) ప్రేమలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుకుంటున్న వీళ్ళు ఎక్కడా కూడా ఈ విషయాన్నీ బయట పెట్టలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ స్టేజ్ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా శోభ శెట్టి పెళ్లి (Shobha Shetty Marriage) గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
శోభ శెట్టి- యశ్వంత్ రెడ్డి నిశితార్థం
శోభ శెట్టి – యశ్వంత్ రెడ్డి నిశితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే శోభ శెట్టి తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. “మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము. మా రెండు కుటుంబాలు.. మా పెళ్లి తాంబూలాలు మార్చుకున్నాము. త్వరలోనే మా ఎంగేజ్ మెంట్ ముహూర్తాన్ని అనౌన్స్ చేస్తామని తెలిపింది”. రీసెంట్ గా స్టార్ మా స్టేజ్ పై కూడా వీళ్లిద్దరికీ రింగ్స్ ఎక్స్ చేంజ్ చేయించారు. ఇక ఇప్పుడు వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లితో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే!
బిగ్ బాస్ తర్వాత శోభ శెట్టి పలు టీవీ షోస్, ఇంటర్వూస్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే ‘కాఫీ విత్ శోభ’ (Coffee With Shobha) సెలెబ్రెటీ టాక్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. శోభ యాంకర్ గా చేస్తున్న ఈ షో సుమన్ టీవీ రాబోతున్నట్లు ఆమె తెలిపింది. ఇప్పటికే ఈ షోలో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ, సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా, టేస్టీ తేజ పాల్గొన్నారు.
View this post on Instagram
Also Read: పింక్ డ్రెస్లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే