Shivani Rajashekar: ఉప్పెన సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి డెబ్యూ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందికుంది. ఈ ఒక్క సినిమాతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. బేబమ్మ క్యారెక్టర్ లో కృతి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో ఫుల్ పాపులరైన ఈ బ్యూటీ వరుస ఆఫర్స్ అందుకొని.. ఇండస్ట్రీలో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి కి ముందు మరొకరిని అనుకున్నారట.
ఉప్పెన మూవీలో ముందుగా శివానికి ఛాన్స్
అయితే ముందుగా ఉప్పెనలో కృతి పాత్ర కోసం స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా రిజెక్ట్ చేశారట. రీసెంట్ గా శివాని నటించిన ‘కోట బొమ్మాలి పీఎస్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చెప్పిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అందుకే రిజెక్ట్ చేశాను
శివాని ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇలా అన్నారు. ఉప్పెన స్టోరీకి ముందుగా నన్ను అప్రోచ్ అయ్యారు.. కానీ స్టోరీ నరేషన్ చేసినప్పుడు చాలా బోల్డ్, రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవి నాకు కాస్త అన్ కంఫర్టబుల్గా అనిపించాయి.. అప్పుడు నాకు ఒక భయం ఉండింది. అప్పటికీ నా సినిమాలు ఏవీ ఇంకా బయటకు రాలేదు. అందుకే రిజెక్ట్ చేశానని చెప్పారు. కానీ సినిమా ముందు డ్రాఫ్ట్ వేరేలా ఉండే.. సినిమా డిఫెరెంట్ గా ఉందని చెప్పారు. ఒకవేళ ఉప్పెన సినిమా ఒకే చేసి ఉంటే.. శివాని కెరీర్ పీక్స్ కు వెళ్ళేదేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శివాని ‘కోట బొమ్మాలి పీఎస్’ సినిమాతో మంచి హిట్ కొట్టేసింది. రీసెంట్ గా వచ్చిన రంగమార్తాండ సినిమాలో కూడా తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో మాత్రమే కాదు డిజిటల్ వరల్డ్ లో కూడా కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్, ఫిలిమ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అద్భుతం, ఆహా నా పెళ్ళంట వంటి సీరీస్ లో నటించింది.