King Nagarjuna First Look – Kubera Movie: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు ధనుష్ చిత్రాన్ని విడుదల చేయగా..తాజాగా కింగ్ నాగ్ లుక్ ని విడుదల చేశారు.
వర్షంలో తడుస్తున్న నాగార్జున గొడుగు పట్టుకుని ఉండగా వర్షంలో తడిసి ముద్దయిన ఐదు వందల నోటు కనిపిస్తుంది. దాంతో అందరూ నాగార్జున డబ్బులు తీసుకుంటారని భావిస్తారు. అయితే నాగ్ తన జేబులో నుండి ఓ 500 రూపాయల కాగితాన్ని తీసి ఓ చోట ఉంచాడు. ఈ సన్నివేశంతో నాగార్జున పాత్ర గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేగుతుంది. .
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొంత కాలంగా ఆయన నటించి విడుదల చేసిన సినిమాలన్ని కూడా మంచి హిట్లను అందుకున్నాయి. ధనుష్ కుబేర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల…మొదటి సారి మాస్ అండ్ యాక్షన్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పైగా పూర్తి చేసుకుంది. భారీ స్థాయి, భారీ బడ్జెట్ తో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. నాగార్జున పాత్ర ఈ సినిమాలో చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.