Car Accident : శంషాబాద్ (Shamshabad) మున్సిపల్ పరిధి తొండుపల్లి సమీపంలోని ఓఆర్ఆర్ (ORR) పై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు డీకొట్టింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎగిరి కారు అద్దంపై పడడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్య(65)గా గుర్తించారు. అంజయ్య ఒక రోజువారీ కూలి. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంజయ్య ఈ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అంజయ్య ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడ వైపు బయల్దేరాడు. మధ్యలో తొండుపల్లి కూడలి వద్ద ఓఆర్ఆర్ దాటుతుండగా.. గచ్చిబౌలి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తల బలంగా కారు అద్దానికి తాకడంతో అద్దం పగిలి.. మెడ కోసుకుపోయి తల సీటు లోపల.. మొండెం రోడ్డుపై పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన అందరి మనసుల్ని కలచివేస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.