బాలకృష్ణ హీరోగా , కాజల్, శ్రీలీల నటించిన సినిమా ”భగవంత్ కేసరి”. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా గురించి, అందులోని హీరో గురించి సంచలన కామెంట్లు చేసింది హీరోయిన్ మాధవీ లత.
ఈ సినిమాలో హీరో చేత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి వివరించడం బాగానే ఉంది. అలా చెప్పించడం కూడా చాలా మంచి విషయం అని ఆమె పేర్కొంది. ఈ సినిమాలో హీరోయిన్ ని గ్లామర్ పాత్రకి పరిమితం చేసి హీరో చేత ఇలాంటి డైలాగులు చెప్పించడం ఆలోచించాల్సిన విషయం అంటూ మాధవీ లత పేర్కొంది.
Also read: ఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా !
ఈ సినిమా లో శ్రీలీల పాత్ర బాగుందని విన్నానని ఆమె వివరించారు. ఆమెతో కూడా అలాంటి పాత్ర కాకుండా గ్లామర్ పాత్ర చేయిస్తే..చేసేది శివపూజ దూరేది ఇంకేక్కడో అన్నట్లు గా ఉంటుందని ఆమె పేర్కొంది. అంతేకాకుండా..ఆమె మాట్లాడుతూ..డైలాగులు చెప్పవడం వరకే కాదు.. ఆ డైలాగులు చెప్పే వారు నిజ జీవితంలో కూడా పాటిస్తే మంచిది అంటూ ఓ బాంబ్ పేల్చింది.
ప్రస్తుతం ఆమె వేసిన ఈ సెటైర్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె నేరుగా ఎవరినీ విమర్శించకపోయినా బాలకృష్ణను పరోక్షంగా విమర్శించినట్టు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మాధవీలత స్నేహితుడా, నచ్చావులే వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత మాత్రం ఆమె సినిమాలు చేయలేకపోయింది. కొంతకాలం క్రితం ఆమె బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది.