Apple : యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న వినియోగదారులు హై రిస్క్(High Risk) లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(Cyber Security Agency) సెర్ట్ – ఇన్(SERT – IN) హెచ్చరికలు జారీ చేసింది. ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం ఉందని, వినియోగదారులు తమ డివైజ్ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు.
ఐఫోన్(iPhone), మ్యాక్ బుక్, ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్స్.. తదితర వాటిల్లో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్’కు సంబంధించి అత్యంత క్లిష్టమైన భద్రతాపరమైన లోపం తలెత్తినట్టు ‘సెర్ట్-ఇన్’ తెలిపింది.ఈ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి డివైజ్లను రిమోట్గా ఆపరేట్ చేసే ముప్పు ఉన్నదని హెచ్చరించింది.
యూజర్లు తమ డివైజ్లను లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పబ్లిక్ వైఫై ను వాడొద్దని, యాప్లను డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ లో పెట్టుకోవాలని పేర్కొన్నది.
Also read: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ… అంతేకాకుండా బుక్ ఫండింగ్ కూడా… వెంటనే అప్లై చేసేయండి!