Haryana: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనతో యావత్ భారత దేశం అట్టుడుకుతున్న క్రమంలో మరో ఘోరం బయటకు వచ్చింది. ఈసారి ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రోహ్తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు.
ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఆదివారం పీజీఐఎమ్ఎస్ డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌తో నిందితుడు కౌశిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు సోషల్ మీడియా ద్వారా తన బాధను తెలియజేసింది. శరీరమంతా గాయాలు చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కౌశిక్ తనను ప్రేమించాలని, శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని తెలిపింది.
रोहतक, हरियाणा PGI का सीनियर डॉक्टर मनिंदर गिरफ्तार हुआ है। आरोप है कि वो मेडिकल छात्रा को कार में किडनैप करके अंबाला–चंडीगढ़ ले गया। उस पर जबरन शादी का दबाव बनाया। उसकी पिटाई की। आरोपी डॉक्टर मनिंदर को गिरफ्तार करने के बाद PGI से सस्पेंड कर दिया गया है। pic.twitter.com/YTFPIWYOtw
— Sachin Gupta (@SachinGuptaUP) August 19, 2024
వ్యతిరేకించినందుకు తన మీద దాడి చేశాడని విద్యార్థిని వివరించింది. శారీరకంగా, మానసికంగా చాలా హింస పెట్టాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేయించడమే కాకుండా.. క్యాంపస్ నుంచి బహిష్కరించింది.