‘ప్రేమ దేశం’హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో ఒక ఊపు ఊపేశాడు అబ్బాస్. హీరోగా, విలన్ గా, తమ్ముడిగా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో రకాల పాత్రలు చేశారు. ముఖ్యంగా అబ్బాస్ హెయిర్ కటింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. ‘అబ్బాస్ హెయిర్ కటింగ్’ అని చాలా మంది ఇప్పటికే చేయించుకుంటారు. ఇక ఉండే కొద్దీ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో.. ఆయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ చాలా రకాల పనులు చేశారు అబ్బాస్.
పెట్రోల్ బంక్ లో, వెయిటర్ గా, ట్యాక్సీ డ్రైవర్ గా, ఇలా ఎన్నో పనులు చేసి ఇప్పుడు ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో సెటిల్ అయ్యారు. ఈ విషయాలన్నీ ఆయనే ఓ సందర్భంలో మీడియాకి చెప్పారు. చాలా ఏళ్ళ తరువాత అబ్బాస్ ఒక సర్జరీ ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరయ్యాడు. తనకు సర్జరీ జరుగుతుందని సోషల్ మీడియా ద్వారా అబ్బాస్ తెలపడంతో.. ఆయన గురించి మళ్లీ చర్చ మొదలైంది. అందులోనూ అబ్బాస్ హీరో విశాల్ గురించి చేసిన కామెంట్స్ ఇంకా వైరల్ గా మారాయి.
గతంలో అబ్బాస్ – హీరో విశాల్ మధ్య ఒక గొడవ జరిగిందని చాలా తక్కువమందికి తెలుసు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో వీరి మధ్య గట్టి యుద్ధమే జరిగింది. మొట్ట మొదటిసారి ఆ గొడవపై అబ్బాస్ స్పందించారు. విశాల్ పై పగ అని చెప్పలేని కానీ.. కోపం మాత్రం ఉందని చెప్పారు. నా విషయంలో తను ప్రవర్తించిన తీరు చాలా దారుణం.. అది నాకు నచ్చలేదు.. కానీ అతన్ని ఎప్పుడో నేను క్షమించాను అని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా విశాల్ ఎదురుపడితే హాయ్ అని పలకరిస్తాను.. కానీ క్లోజ్ గా మాత్రం ఉండలేనంటూ అబ్బస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సినీ పరిశ్రమలోని నటులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. ఈ లీగ్ సెకండ్ సీజన్ లో విశాల్ నా గురించి అబద్దాలు చెప్పాడు.. ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. అలాంటి వాతావరణంల ఉండాలని నాకు అనిపించలేదు.. అందుకే నేనే వెనక్కి తగ్గాను అని వివరించారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో అతను కూడా ఒకడు కాబ్టటి అది నా మనసులో అలాగే ఉందని చెప్పారు. అంతేకాకుండా తమిళ్ హీరోలైన అజిత్, విజయ్, సూర్యల గురించి కూడా అబ్బాస్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ ఇంటర్వ్యూ కోలీవుడ్ ని కుదిపేస్తుంది. మరి అబ్బాస్ వ్యాఖ్యలపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.