SBI Apprentice Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలైంది. ఇవాళ్టి(సెప్టెంబర్ 1) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసుకోవచ్చు. sbi official website చివరి తేదీ సెప్టెంబర్ 21. ఈ ప్రొగ్రెమ్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. విద్యార్థులకు నెలకు రూ.15,000 స్టైఫండ్‌ను అందిస్తుంది. ఆన్లైన్ పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్‌లో షెడ్యూల్ చేశారు. రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.
ఎలా దరఖాస్తు చేయాలి:
➼ Sbi.co.in లో SBI అధికారిక సైట్‌ని సందర్శించండి.
➼ కెరీర్ లింక్‌పై క్లిక్ చేయండి, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
➼ ఎస్బీఐ(SBI) అప్రెంటీస్ దరఖాస్తు ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
➼ మీరే నమోదు చేసుకోండి, ఖాతాకు లాగిన్ అవ్వండి.
➼ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, దరఖాస్తు రుసుము చెల్లించండి.
➼ సమర్పించు(submit)పై క్లిక్ చేసి, పేజీని డౌన్లోడ్ చేయండి.
➼ హార్డ్ కాపీని సేవ్ చేయండి. తర్వాత కాపీని ప్రింట్ అవుట్ తీసుకోండి.
అర్హత ప్రమాణాలు:
➼ అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
➼ అభ్యర్థి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి
➼ అభ్యర్థి తప్పనిసరిగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
➼ అభ్యర్థి వయసు 20-28 సంవత్సరాలు మధ్య ఉండాలి
SBI అప్రెంటిస్ లాంగ్వేజ్ టెస్ట్:
అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాషలో పరీక్ష జరుగుతుంది. కింది భాషలకు స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు:
➼ అస్సామీ
➼ బెంగాలీ
➼బోడో
➼ భోటీ
➼ కోక్బోరోక్
➼ ఆంగ్ల
➼ గుజరాతీ
➼ హిందీ
➼ కన్నడ
➼ కొంకణి
➼ లడఖీ
➼ మలయాళం
➼ మరాఠీ
➼ మణిపురి
➼ నేపాలీ
➼ ఒరియా
➼ పంజాబీ
➼ సంతాలి
➼ తమిళం
➼ తెలుగు
➼ ఉర్దూ
దరఖాస్తు రుసుము:
జనరల్/OBC/EWS రూ.300
SC/ST/PwBD – రుసుము లేదు
ALSO READ: 1,303 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు.. త్వరపడండి..!