Klin Kaara-Ram Charan: మెగాపవర్ స్టార్ రాంచరణ్ -ఉపాసనల ముద్దులకూతురు మెగాప్రిన్సెస్ క్లీంకార సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యే క్లీంకారను చూసుకునేందుకు కేర్ టేకర్ ను నియమించారని…ఆమె జీతం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్లీంకార కోసం ఓ ప్రత్యేక రూమ్ ను కూడా డిజైన్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూతురు కోసం ప్రముఖ నానీని నియమించారు.
ఆమెకు నెలకు మూడులక్షల జీతం చెల్లిస్తున్నారట. కొద్దిరోజుల క్రితం రాంచరణ్ తన కూతురితో కలిసి గుడికి వెళ్లారు. అప్పుడు సావిత్ర కూడా ఉంది. సావిత్రి బాలీవుడ్ లో చాలా ఫేమస్. షాహిద్ కపూర్, సైఫ్ అలీఖాన్, మీరా రాజ్ పుత్ ల దగ్గర సావిత్రి పనిచేశారట. అయితే రాంచరణ్ కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయ్యారు. చరణ్ షుటింగ్ పనులతో, ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలతో చాలా బిజీగా ఉండటంతో క్లీంకార బాధ్యతలను సావిత్రికి అప్పగించాలని నిర్ణయించుకున్నారట.
ఇది కూడా చదవండి: దుమ్మురేపిన అంబాజీపేట..రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా?
అయితే ఇప్పటివరకు చరణ్ తన గారాలపట్టి క్లీంకారను బయటకు చూపించలేదు. తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను , ఆలనపాలన చూసుకోవడంతోపాటు అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవల్సి వస్తుంది. అందుకే అంత జీతం చెల్లించి సావిత్రిని నియమించారట. అయితే ఈ విషయాన్ని మాత్రం రామ్ చరణ్ దంపతులు అధికారికంగా వెల్లడించలేదు.