Save The Tigers Series: ప్రియదర్శి (Priyadarshi), అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, పావని, దేవీయని శర్మ, గంగవ్వ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సీరీస్ ‘సేవ్ ది టైగర్స్’. యాత్ర మూవీ ఫేమ్ మహి వి.రాఘ ఈ సీరీస్ ను తెరకెక్కించారు. గతేడాది రిలీజైన సీజన్ 1 సూపర్ హిట్ అవ్వగా.. ఇటీవలే సీజన్ 2 కూడా విడుదల చేశారు. మార్చి 15 నుంచి డిస్నీ హాట్ స్టార్ (Disney+ Hotstar) వేదికగా ప్రసారమవుతున్న ఈ సీరీస్ కు విశేష ఆదరణ లభిస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ తో సత్తాచాటుతుంది ‘సేవ్ ది టైగర్స్’.
‘సేవ్ ది టైగర్స్’ రికార్డు
అయితే తాజాగా ఈ సీరీస్ మరో కొత్త రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఇండియన్ ఓటీటీ షోస్ జాబితాలో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ‘సేవ్ ది టైగర్స్’ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
డైరెక్టర్ మహి వి.రాఘవ్ కామెంట్స్
దీని పై దర్శకుడు మహి వి.రాఘవ్ స్పందిస్తూ.. ఇలాంటి అరుదైన సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదని. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరో సారి రుజువైందని. ఈ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు అని తెలిపారు.
View this post on Instagram