Kalyan Ram – Devil : తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్య భరిత చిత్రాలను నిర్మిస్తూ , నటిస్తోన్న వర్సటైల్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram). బింబిసారతో బ్లాక్ బస్టర్ హట్ కొట్టిన కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టెనర్ డెవిల్(Devil) మూవీ. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చి థియేటర్స్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి త్వరలో ఓటిటి(OTT) లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమయింది.
అమేజాన్ ఓటిటీలో జనవరి14న స్ట్రీమింగ్:
సంక్రాంతి(Sankranti) కానుకగా జనవరి 14 న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో స్ట్రీమింగ్ కానుంది. అయితే…ఫస్ట్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో డెవిల్ అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత మిగిలిన ల్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 240 కంట్రీస్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ప్రయోగాత్మక చిత్రాలకు ప్రోత్సాహం
అతనొక్కడే చిత్రంతో టాలీవుడ్(Tollywood) లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఓం 3D లాంటి డిఫరెంట్ ఫిల్మ్ తో అలరించారు.మొదటి సినిమా సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ తరువాత చాలా మంది కొత్త దర్శకులకు అవకాశమిచ్చారు. పటాస్ మూవీ తో అనీల్ రావిపూడి , బింబిసార మూవీ తో వశిష్ట మంచి పేరు తెచ్చుకున్నారు. బింబిసార తరువాత వచ్చిన అమిగోస్ మూవీ ఆశించినంత విజయాన్నివకపోయినా సరే..ఆ మూవీకి వసూళ్లు బాగానే వచ్చాయి.ఆ తరువాత వచ్చిన డెవిల్ ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించబోతోంది.
జై లవకుశ,దేవర చిత్రాల నిర్మాత
నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలా చేసిన చిత్రం ఓం త్రీడీ.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవ కుశ చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర చిత్రానికి సైతం నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పటికే రిలీజయిన దేవర ఫస్ట్ గ్లింప్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
నెక్స్ట్ మూవీ ఏంటి?
డెవిల్ రిలీజైన తరువాత కళ్యాణ్ రామ్ ఇంకా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. ఈ సారి ఎలాంటి జానర్ చిత్రంతో అలరించనున్నారో అని అంతా చాలా క్యూరియాసిటీ తో ఎదురు చూస్తున్నారు.
ఆ లోగా అమేజాన్ లో స్ట్రీమింగ్ అవ్వబోయే డెవిల్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ అలరించింది. కీలక పాత్రల్లో అజయ్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, సీత, మాళవిక నాయర్ తదితరులు నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
Also Read : Rahul: నేటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ