Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో(Industrial Area) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. అమర్ ల్యాబ్స్‌లో(Amar Labs) భారీ శబ్ధంతో రెండు రియాక్టర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. కాగా, నైట్ షిఫ్ట్‌లో 15 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు.. సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో చీకటి ఉండటంతో.. ఎంత మంది ప్రమాదంలో చిక్కుకున్నారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. స్థానికుల సహాయంతో ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పరిశ్రమలో చిక్కుకున్న వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, కంపెనీలో రెండు రియాక్టర్లు ఒకేసారి భారీ శబ్ధంతో పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏమైందోనని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.