ఎల్బీనగర్ లో ప్రజల నుంచి బీజేపీకి సానుకూల స్పందన వస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామా రంగారెడ్డి అన్నారు. ఎల్బీనగలో వార్ వన్ సైడే అని.. భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారన్నడానికి జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనమన్నారు. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ముంపు సమస్యను పట్టించుకోలేదని మండిపడ్డారు. శాశ్వత పరిష్కారం చూపి…ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి… 16ఎకరాల చేపల చెరువును కబ్జా చేశాడని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా స్థానికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని…ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎల్బీనగర్ ప్రజలు భారీ షాక్ ఇస్తారన్నారు. ఆర్టీవీతో సామా రంగారెడ్డి సంచలన ఇంటర్వ్యూ పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన