Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరెకెక్కిన లేటెస్ట్ సినిమా ‘సలార్’. విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సలార్ పలు సార్లు వాయిదా పడడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఎట్టకేలకు సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృదం సలార్ నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ చేసి అభిమానులకు వరుస సర్ప్రైజ్ లు ఇస్తోంది. తాజాగా ‘సలార్’ నుంచి మరో ట్రైలర్ విడుదల చేసి ఫ్యాన్స్ ను మరింత ఖుషీ చేశారు. ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసింది.
Also Read: Hero Nikhil: ఆ థియేటర్ లో ‘సలార్’ సినిమాకు 100 టికెట్స్ ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్..!
బద్ద శత్రువులుగా మారే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఖాన్సార్ ఎరుపెక్కాలా’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ట్రైలర్ అభిమానుల అంచనాలను మరింత పెంచేసింది. ‘సలార్’ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ద ఫైర్’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా కనిపించనుంది. పృథ్వీ రాజ్ ప్రతి నాయకుడిగా, ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రియ రెడ్డి, టిన్నూ ఆనంద్, కీలక పాత్రల్లో నటించారు.
Also Read: Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు.. అరెస్టు తప్పదా..?