Salaar Trailar: కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన చిత్రం సలార్. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సలార్ పార్ట్ – సీజ్ ద ఫైర్ ఈ నెల 22 న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాజాగా సలార్ పార్ట్ 1 ట్రైలర్ ను విడుదల చేశారు. రిలీజైన ఒక్క రోజులోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.
3 నిమిషాలు 46 సెకండ్స్ నిడివి గల ఈ ట్రైలర్.. “దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం” అంటూ ఒక బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చాలా ఆసక్తిగా మొదలైంది. ట్రైలర్ మొదటి నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్యారెక్టర్స్ చాలా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఈ చిత్రంలో దేవగా ప్రభాస్, ఆయన ఫ్రెండ్ వరదరాజ్ మున్నార్ పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించారు. ట్రైలర్ లో “చెప్పారా ఎవడు.. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా” అనే సంభాషణతో ఈ సినిమా ఇద్దరి మిత్రుల కథనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో కొంత సమయం తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ పట్టుకున్న రాడ్ పై తన వేలి ముద్రలు కనిపించాయి. దీంతో సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో కనిపించింది. ట్రైలర్ లో ఎలివేషన్స్, నేపథ్య సంగీతం, స్క్రీన్ ప్లే, యాక్షన్ సెక్వెన్సెస్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ‘‘పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటకు ఎవడో పోతాడని కాదు. లోపలికి ఎవడొస్తాడని’’, ‘‘నిన్ను ఎవడూ ముట్టుకోకూడదు’’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ కు మరింత హైప్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ చివరిలో ప్లీజ్.. ఐ.. కైండ్లీ రిక్వెస్ట్ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
Also Read: Bigg Boss 7 Telugu: అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ .. పాపం అమర్.. మళ్ళీ నిరాశే మిగిలింది..!