Salaar Leaks: ప్రభాస్ ‘సలార్’ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. K.G.F సినిమా వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ ఫైనల్ గా డిసెంబర్ 22 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీకైనట్లు సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఆఫ్రికన్ ట్రైబల్స్ తో షూట్ చేస్తున్న సన్నివేశాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ డ్యూయల్ రోల్ కనిపించనున్నాడని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తల్లో వాస్తవమెంత, అవాస్తమెంత అనేది తెలియాల్సి ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘Hombale Films’ నిర్మాణ సంస్థ, విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే విడుదలైన టీజర్ చివరిలో పార్ట్ 1: సీస్ ఫైర్’ (Salaar Ceasefire) అని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా రెండు భాగాలుగా ఉండబోతున్నట్లు తెలిసింది. ఇక సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Venu Yeldandi: గుడ్ న్యూస్ చెప్పిన వేణు.. ఫొటోలు వైరల్..!