Saindhav Movie: విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సైంధవ్. వెంకటేష్ 75 వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయిని పల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 న సైంధవ్ ప్రపంచవ్యాప్తతంగా విడుదల కానుంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సైంధవ్ టీమ్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. రీసెంట్ విడుదలైన సైంధవ్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను మరింత పెంచుతోంది. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన సైందవ్ సినిమాలోని పాత్రల ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
తాజాగా సాంగ్ లంచ్ ఈవెంట్ లో భాగంగా సైంధవ్ టీమ్ విజయవాడ, గుంటూరు లో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో వెంకటేష్, శైలేష్ కొలను, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ చిత్ర బృందం VVIT కాలేజీ విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైంధవ్ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ రుహానీ శర్మ , నవాజుద్దీన్, కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
Some Sarada moments with the students of VVIT for the team #SAINDHAV 🤩🔥
Victory @VenkyMama had an amazing time playing cricket during the song launch ❤️
– https://t.co/dJoSzxK5F9#SaindhavOnJAN13th#SsaraPalekar @ShraddhaSrinath @KolanuSailesh @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/yZkwGvxuDT
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2023
Thandel: నాగ చైతన్య ‘తండేల్’ షూటింగ్.. ఎక్కడో తెలుసా..? – Rtvlive.com