Kiran Abbavaram rules ranjan: కిరణ్ అబ్బవరం(kiran abbavaram) హీరోగా నటించిన సినిమా రూల్స్ రంజన్. ఎప్పుడైతే సలార్ సినిమా పోస్ట్ పోన్ అయిందో, ఆ వెంటనే రూల్స్ రంజన్‌ను ఆ తేదీకి ప్రకటించారు. సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేస్తున్నట్టు పోస్టర్ కూడా వదిలారు. అయితే ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. ఇంతకుముందు చెప్పినట్టు సెప్టెంబర్ 29కి సినిమా రావడం లేదు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 6న రూల్స్ రంజన్ థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ మేరకు మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
వినోదంలో ముంచెత్తిన ట్రైలర్:
అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. ‘రూల్స్ రంజన్’ చిత్రాన్ని పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందిస్తున్నారు మేకర్స్. చిత్ర కథ, దానికి అనుగుణంగా సాగే సన్నివేశాలు, వాటికి తగ్గట్లుగా సంభాషణలు, వీటికి తగ్గ నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు నిర్మాతలు.
కిరణ్ అబ్బవరం ప్రాజెక్ట్‌ల నుంచి వెనక్కి తగ్గుతారా?
రూల్స్ రంజన్ సినిమాలో మెహర్ చాహల్ సెకెండ్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌ను, మార్కెట్‌ని డిసైడ్ చేసే చిత్రంగా మారింది రూల్స్ రంజన్. ఇప్పటికే ఈ హీరో చేతిలో మరో 5 సినిమాలున్నాయి. రూల్స్ రంజన్ హిట్టయితేనే ఆ సినిమాలకు మార్కెట్ ఉంటుంది. అంతేకాదు, బడ్జెట్ కేటాయింపులు కూడా ఉంటాయి. ఈ సినిమా రిజల్ట్ ఏమాత్రం తేడాకొట్టినా, కిరణ్ అబ్బవరం ప్రాజెక్ట్ ల నుంచి కొంతమంది నిర్మాతలు వెనక్కు తగ్గే ప్రమాదం ఉంది.
ALSO READ: టీడీపీ భవిష్యత్ దబిడి దిబిడే..! జూనియర్ ఎన్టీఆర్ గురించి RGV ట్వీట్ వైరల్!