RT4GM: మాస్ మహారాజ రవితేజ (Raviteja) ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి జోష్ మీద ఉన్నాడు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావుతో (Tiger Nageswara Rao) ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోష్ తో మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపాడు.
గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం తెరకెక్కుతోంది. గురువారం హైదరాబాద్ లో ఈ చిత్రం పనులు ఘనంగా ప్రారంభం అయ్యాయి. క్రాక్ (Krack) తో హ్యాట్రిక్ విజయం తరువాత ఇద్దరు కలిసి చేస్తున్న మరో సినిమా ఇది. దీంతో అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.
Also read: మునుగోడు నుంచే పోటీ చేస్తా..బీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి!
తాజా చిత్రంలో రవితేజ లుక్ ఎలా ఉంటుంది అనే దాని మీద అభిమానులు ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. అన్మోల్ శర్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
With gratitude, I’m extending my heartfelt thanks to the honored guests who illuminated our #RT4GM Pooja ceremony today. ❤️
This marks not just my 4th with Mass Maharaja @RaviTeja_offl garu but a FORCE that resonates with double the energy! 🔥⚡#RT4GMBlast 💥@selvaraghavan… pic.twitter.com/mSzEjNGuFM
— Gopichandh Malineni (@megopichand) October 26, 2023
ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. రవితేజను సరికొత్త పాత్రలో చూపించబోతున్నట్లు పేర్కొంది. రవితేజకు జోడీగా నటించే హీరోయిన్ పై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది
Excited to embark on a new journey with some wonderful friends!
Our #RT4GM journey starts with positive vibes. Grateful for your blessings & support. 🙏❤️#RT4GMBlast 💥
MASS MAHARAJA @RaviTeja_offl @selvaraghavan @Actress_Indhuja @MusicThaman @dop_gkvishnu #ASPrakash… pic.twitter.com/PKRc4DrW7C— Gopichandh Malineni (@megopichand) October 26, 2023
Also read: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే?
సెల్వ రాఘవన్, ఇందూజ రవిచంద్రన్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు తీసుకుని వెళ్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపారు.
With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note 💥💥
The much awaited project begins its shoot very soon ❤🔥#RT4GMBlast 💥
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0
— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023
Also read: టీటీడీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ …మీరు అర్హులా..వెంటనే ఆప్లై చేయండిలా!