వెయ్యి రూపాయల నోటు మళ్లీ రానుందా? నోట్ల రద్దు సమయంలో వెయ్యిరూపాయల నోటును తొలగించింది ఆర్బీఐ. ఆ స్థానంలో 2వేల నోటును తీసుకొచ్చింది. ఇప్పుడు అది కూడా రద్దయ్యింది. అయితే తాజాగా ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. వెయ్యి రూపాయల నోటు వస్తుందని ప్రచారం షురూ అయ్యింది. అయితే ఇందులో నిజమెంత? ఎందుకు ఇలా ప్రచారం జరుగుతోంది? ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైంది? ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుుసుకుందాం.
ఇది కూడా చదవండి: ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!
2వేల నోటును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన వేళ వెయ్యిరూపాయల నోటు మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయంపై ఓ వార్త కూడా తెగ వైరల్ అవుతోంది. ఆర్బీఐ వెయ్యి రూపాయల నోటును మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆ వార్త సారాంశం. వెయ్యి రూపాయల నోటును మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్బీఐ పరిగణలోనికి తీసుకోలేదని పలు రిపోర్టులు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన!
ఇక ఈ ఏడాది మే 19న 2వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నోట్ల మార్పిడికి దాదాపు 4 నెలల గడువు కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే ప్రస్తుతం రూ.1000 కరెన్సీ నోటును ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.
RBI is not in consideration of the re-introduction of Rs 1000 note: Sources
— ANI (@ANI) October 20, 2023