Romeo : వినాయక వైద్యనాథన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony), మృణాళిని(Mrunalini) జంటగా నటించిన మూవీ రోమియో. తెలుగులో ఈ చిత్రం లవ్ గురు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ(OTT) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ఈ మూవీ.
ఓటీటీ రిలీజ్
తాజాగా లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా(Aha) తమిళ్ లో ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది ఆహా. తమిళ్, తెలుగు రెండు భాషల్లో అదే రోజు స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
రోమియో స్టోరీ
అరవింద్ (విజయ్ ఆంటోనీ ) మలేషియాలో ఒక కేఫ్ బిజినెస్ నడుపుతుంటాడు. కుటుంబ బరువు, బాధ్యతలను మోస్తున్న విజయ్ తన వ్యకిగత జీవితాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. 35 ఏళ్ళ వయసు వచ్చిన పెళ్లి , ప్రేమ లేకుండా ఉండిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు లీలా (మృణాళిని) చూసి మనసు పారేసుకుంటాడు. కానీ ఆమెకు విజయ్ తో పెళ్లంటే ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె కోరిక. కానీ ఆమె తండ్రి బలవంతంగా హీరోతో పెళ్లి చేస్తాడు. ఇక అరవింద్ ఆమె మనసు గెలుచుకోవడానికి ఏం ప్రయత్నాలు చేశాడు..? చెల్లికి సంబంధించి అతన్ని వెంటాడుతున్న చేదు జ్ఞాపకం ఏంటీ అనేది స్టోరీ.
Intha 💓ROMEO-oda aatatha May 10th anniki pappinga. 💏#ROMEO Premieres May 10th on @ahatamil #RomeoOnAha 💕@aandpgroups @vijayantony @mirnaliniravi @actorvinayak_v @BarathDhanasek5 @kav_pandian @prorekha @thinkmusicindia pic.twitter.com/owFiEvNZYn
— aha Tamil (@ahatamil) May 4, 2024
Also Read: Urfi Javed: ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..!