Viral News: ఆయనో జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు… ఆయన ఇంట్లో దొంగలు పడి ఆయనకు వచ్చిన జాతీయ అవార్డులను ఎత్తుకుపోయారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. తీరా చూస్తే ఆ దొంగలే అవార్డులన్నింటిని కలిపి ఓ కవర్ లో పెట్టి దర్శకుని ఇంటి ముందు పెట్టి.. వాటితో పాటు క్షమించమని ఓ లేఖను పెట్టి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే… ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. ఆయనకు వచ్చిన జాతీయ అవార్డులను ఎత్తుకుపోయారు. ఈ విషయం గురించి మణికందన్ పోలీసులుకు తెలిపారు. దాంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో విషయం తెలుసుకున్న దొంగలు ఏం అనుకున్నారో ఏమో మరి…అవార్డులన్నింటిని తెచ్చి ఇంటి ముందు ఓ కవర్ లో కట్టిపెట్టారు.
అంతేకాకుండా ఆ అవార్డులతో పాటు ఓ లెటర్ కూడా రాసి పెట్టారు. ఆ లెటర్ లో ” సార్ మమ్మల్ని క్షమించండి ” అని నోట్ రాసి పెట్టారు. దీని పై సమాచారం అందుకున్న పోలీసులు కూడా లెటర్ చూసి ఖంగుతిన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మధురైలో ఉసిలంపట్టిలోని దర్శకుడు మణికందన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ సమయంలో ఆయన ఇంటికి తాళం వేసి ఉండడంతో వారి పని మరింత సులువైంది. ఆయన ఇంట్లో నుంచి సుమారు లక్ష రూపాయల నగదు, ఐదుసవర్ల విలువైన బంగారు నగలను ఎత్తుకుపోయారు. అక్కడితో ఆగకుండా డైరెక్టర్ కి వచ్చిన జాతీయ అవార్డులను కూడా ఎత్తుకుపోయారు.
Also read: ఢిల్లీకి రైతులు పాదయాత్ర… భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ 5 సరిహద్దులు మూసివేత!