Rohit Sarma: ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుంచి చాలా లాంగ్ గ్యాప్ దొరికింది. దీంతో ప్రతి ఆటగాడు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. టీ 20 గెలిచిన తరువాత రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా ఉన్నాడు.
తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు ఆడతాడు. ప్రస్తుతం లాంగ్ బ్రేక్ దొరకడంతో ఆయన కుటుంబంతో కలిసి వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికతో కలిసి CEAT క్రికెటర్ రేటింగ్ కార్యక్రమానికి విచ్చేశాడు. ప్రస్తుతం ఈవెంట్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Junior Hitman 🔜🥹🧿🥹😭 pic.twitter.com/7CQCXsHy2i
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 23, 2024
ఈ ఈవెంట్ లో రోహిత్ శర్మ భార్య రితికను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. రితిక మళ్లీ గర్భంతో ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె చిన్నపాటి బేబీ బంప్ తో ఉన్నట్లు ఈ వీడియోలో తెలుస్తుంది అయితే ఈ విషయం గురించి హిట్ మ్యాన్ నుంచి క్లారిటీ రావాల్సిందే.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. అతి త్వరలోనే రోహిత్ జోడి జూనియర్ హిట్ మ్యాన్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ జంటకు ఇప్పటికే సమైరా అనే పాప ఉంది.
Also Read: నెక్ట్స్ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్!