నేచురల్ స్టార్ నాని , సీతారామం ముద్దుగుమ్మ జంటగా నటించిన సినిమా ” హాయ్ నాన్న” సైలెంట్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం …క్లాస్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని..ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పుకొవచ్చు.
ముందు నుంచి కూడా ఈ సినిమా మీద నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సినిమా మొదలైనప్పుడు ఎలా ఉందో..చివరి వరకు కూడా అలాగే ఉందనే టాక్ వచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టదని, ఫ్రెష్ ఫీల్ ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు. నాని చెప్పినట్లుగానే ప్రేక్షకులు కూడా సినిమాని ఆదరించారు.
ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో శ్రుతి హాసన్ నటించింది. సినిమా విడుదలకు ముందు నాని కొన్ని ప్రత్యేక ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో నాని…సినిమాలో చాలా మంది ఉన్నారు…వారిని చూసి మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఇక ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది ఓ యంగ్ హీరోయిన్.
ఆమె మరెవరో కాదు అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రితికా నాయక్. మెయిన్ హీరోయిన్ కంటే కూడా ఈమెనే ఎక్కువ పాపులర్ అయ్యంది. ఆ సినిమా తరువాత ఈ చిన్నది హాయ్ నాన్న చిత్రంలో ఒక్కసారిగా మెరిసింది. ఏ పాత్రలో అనుకున్నారా..నాని ముద్దుల కూతురు మహిగా.
ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ లో చిన్నప్పటి మహిని మాత్రమే ప్రేక్షకులకు చూపించిన చిత్ర బృందం..పెద్దయిన తరువాత మహీని చూపించలేదు. టీనేజీ మహి పాత్రను రితికా చేసింది నాని ఇంతకు ముందు సినిమా జెర్సీలో ఎలా అయితే తన తండ్రి గురించి కొడుకు అర్జున్ చెబుతాడో..ఇందులో తన తల్లిదండ్రుల గురించి రితికా చెప్పడంతో సినిమా మొదలవుతుంది.
నాని కూతురిగా రితికాను చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సినిమా విడుదల అయ్యేంత వరకు ముద్దుగుమ్మను ఎంత జాగ్రత్తగా దాచిపెట్టారు స్వామి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also read: అభిమానులకు షాకింగ్ న్యూస్..విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్..!!