ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూడేళ్ల క్రితం(2020) ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సహ నటి రియా చక్రవర్తితో డేటింగ్ చేస్తున్నాడు. దీంతో రియా సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె 28 రోజుల పాటు జైలు జీవితం గడిపింది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రియా తన జైలు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. రియా తన జైలు అనుభవం గురించి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా పంచుకుంది. తాను జైల్లో ఉన్న సమయంలో చాలా మంది మహిళలు చుట్టుముట్టారని, చిన్న విషయాలలో కూడా తను ఆనందాన్ని పొందానని నటి చెప్పుకొచ్చింది. జైలు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడి వాతావరణం గురించి చెప్పింది. జైల్లో తోటి ఖైదీలు తనను బాగా చూసుకున్నారని.. సంతోషకరమైన క్షణాలు.. జీవితంలోని చిన్న విషయాలను అభినందిస్తుంటాయని తెలిపింది.
View this post on Instagram
జైలులో సవాలుతో కూడిన రోజులను గడిపినట్లు తెలిపిన రియా చక్రవర్తి…ఊహించని ప్రదేశాల్లో మహిళలు ఆనందాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన జీవితం గందరగోళంలో ఉందని తెలిపింది. తన జీవితం నరకం కంటే అధ్వాన్నంగా ఉందని.. నరకాన్ని ఎవరైనా ఎంచుకోవాల్సి వస్తే.. మానసికంగా దృఢంగా ఉండాలని నిశ్చయించుకున్నానని తెలిపింది రియా. కాగా రియాచక్రవర్తి ఇటీవల MTV షో రోడీస్‌లో కనిపించింది. ఇందులో ప్రిన్స్ నరులా, గౌతమ్ గులాటీ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ షోకి సోనూ సూద్ హోస్ట్‌గా వ్యవహరించారు. జలేబి, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, సోనాలి కేబుల్, మేరే డాడ్ కి మారుతి వంటి చిత్రాలలో రియా నటిస్తోంది.
ఇది కూడా చదవండి: ఎముకలు ఉక్కులా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్ తినండి..!!