Kakinada Road Accident : కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి (National Highway) వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో సహా ఇద్దరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు (Private Travels Bus) అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బస్సు వేగంగా ఢీకొట్టడంతో ఆ ధాటికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాను మీదకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న రిటైర్డ్ జడ్జి (Retired Judge) మోహన్ కుమార్ (Mohan Kumar) అక్కడికక్కడే మృతి చెందారు..ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీను తీవ్ర గాయాలతో ఉండగా అతడిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read: కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి!