తెలంగాణలో ఎన్నికల నగరా మోగినప్పటి నుంచి ప్రధాన పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తున్నాయి. టిక్కెట్ల విషయంలో సీనియర్ నేతలు అలక పాన్పులు ఎక్కుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆ పార్టీని వీడే వారు ఎక్కువ అవుతున్నారనే చెప్పవచ్చు.
దీంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి పెద్ద చిక్కే వచ్చి పడింది. ధనబలం ఉన్న వారికి టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆగ్రహంతో చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడి కారెక్కుతున్నారు. వీరిలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్థన్ రెడ్డి, సీనియర్ నేత పీ. చంద్రశేఖర్ తో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, విష్ణువర్థన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేసి…హస్తం గూటి నుంచి బయటకు వచ్చారు.
Also read: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
ఈ క్రమంలోనే ఎర్ర శేఖర్, చంద్రశేఖర్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోగా..నాగం, విష్ణువర్థన్ రెడ్డి ఇద్దరు కూడా కేసీఆర్ ని కలిశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ , హరీశ్ రావు ఇద్దరు కూడా నాగం జనార్థన్ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కేసీఆర్ కూడా ఆయనకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జూబ్లీ హిల్స్ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా నేడో రేపో బీఆర్ఎస్ లో చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.