Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఎనర్జీ-టు-టెలకాం మీటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 46వ వార్షిక సర్వసభ్య సమావేశానికి(AGM) కౌంట్‌డౌన్ మొదలైంది . జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ నెల ప్రారంభంలో స్టాక్ ఎక్స్ఛేంజ్లలో జాబితా చేసిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
• రిలయన్స్ AGM 2023 తేదీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ AGM సోమవారం, ఆగస్టు 28(ఇవాళ) జరుగుతుంది.
• రిలయన్స్ AGM 2023 సమయం: రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని గతంలో ప్రకటించింది.
• రిలయన్స్ AGM 2023 ఎక్కడ చూడాలి: RIL 46వ AGM వీడియో కాన్ఫరెన్సింగ్ (VC) / ఇతర ఆడియో-విజువల్ మీన్స్ (OAVM) ద్వారా నిర్వహించబడుతుంది. పెట్టుబడిదారులు కంపెనీ అందించిన లింక్‌కి లాగిన్ చేయవచ్చు – https://jiomeet.jio.com/rilagm/
ఇవాళ్టి ఈవెంట్ రిలయన్స్ 46వ AGM ఈవెంట్. ఈ ఈవెంట్లో రిలయన్స్ చాలా ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అందరి చూపు జియో ఎయిర్ ఫైబర్ (Jio Air Fiber) డివైస్ మీదే ఉంది. ఇందులో, వినియోగదారులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందవచ్చు. ఈ ఈవెంట్లో కంపెనీ జియో ఫోన్, జియో 5G డేటా ప్లాన్‌ను కూడా ప్రారంభించవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ డివైస్ పోర్టబుల్ పరికరంగా ఉండనుంది. పేరు సూచించినట్లుగా, ఈ డివైస్ మనకు వైర్లు లేకుండా వైర్‌లెస్‌గా ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. జియో ఇందులో 5G యాంటెన్నాను ఉపయోగిస్తుందని, తద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందుతారని కంపెనీ పేర్కొంది. జియో ఎయిర్ ఫైబర్ తో మనం 1Gbps వరకు వేగవంతమైన వేగాన్ని పొందవచ్చు. జియో 5G టారిఫ్ ప్లాన్లు ప్రపంచంలోని ఏ టెలికాం కంపెనీతో పోల్చినా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ గతేడాది ప్రకటించారు. అటు కంపెనీ ఈ ఈవెంట్‌ని 5G టారిఫ్ ప్లాన్లను ప్రకటించడానికి వేదికగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్లు రాబోయే AGM ఈవెంట్లో ప్రారంభమవుతాయా లేదా రానున్న నెలల్లో ప్రవేశపెట్టబడతాయా అనేది తేలాల్సి ఉంది. ఈ ప్లాన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.