నేటికాలం పిల్లలు పుస్తకాలు చదవడమంటే అస్సలు ఇష్టపడటం లేదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలకు పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా…పుస్తక పఠనం వల్ల లభించే జ్నానం రాదు. అందుకే పిల్లల్లో పఠన ఆసక్తిని పెంపొందించాలి. పిల్లల్లో క్రమపఠన అలవాట్లను ప్రోత్సహించడంలో వారికి చదివేందుకు ప్రేరేపించే ఉత్తేజకరమైన వాతావారణాన్ని అందించడం కీలకం.
ఆసక్తికరమైన పుస్తకాలు:
పిల్లల్లో పఠణ నైపుణ్యాలను పెంపోందించుకోవడానికి వారికి ఆసక్తి ఉన్న పుస్తకాలను తీసుకురావాలి. తర్వాత వాటిని చదివేలా ప్రోత్సహించాలి. ఒకసారి ఈ పద్ధతికి అలవాటుపడితే..పిల్లలు వద్దన్నా పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు. పిల్లలు ఈ పుస్తకాలు చదివిన తర్వాత అందులోని కొన్ని ప్రశ్నలను పిల్లలను అడగండి. అప్పుడు వాటిపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
కలిసి చదవండి:
పిల్లలకు సాధారణ పఠనం అలవాటును పెంపోందించడంలో సహాయపడటానికి పేరెంట్స్ కూడా వారితో కలిసి చదవాలి. ఇలా చేయడం వల్ల వారిలోనూ ఆసక్తి పెరుగుతుంది. పేరెంట్స్ బిగ్గర చదివి వినిపించినప్పుడు…ఎక్కడ పుల్ స్టాప్ , పాజ్ తీసుకోవలన్నది పిల్లలకు అర్థం అవుతుంది. విభిన్న అక్షరాలు చదివేప్పుడు స్వరాలను ఉపయోగించాలి. పిల్లలు కూడా దానిని అనుసరిస్తారు.
చిన్న చిన్న గోల్స్ :
చదువు పిల్లలకు భారంగా ఉండకూడదు. చదివినా కొద్దీ వారికి మరింత ఆసక్తి పెరిగేలా ప్రోత్సహిస్తుండాలి. ఇందుకోసం చిన్న చిన్న పుస్తుకాలను వారికి అందించాలి. వాటిని పూర్తి చేసాక…వారిని అభినందించాలి. వీలైతే చిన్న చిన్న గిఫ్టులు కూడా అందించాలి. దీంతో మరిన్ని పుస్తకాలు చదవాలనే కోరిక వారిలో బలపడుతుంది. తక్కువ సమయంలో చదివినా పర్వాలేదు కానీ దాన్ని ఆస్వాదించడం అలవాటు చేయాలి. అప్పుడు వారు పుస్తకాల పురుగుల్లా మారుతారు.
ఇది కూడా చదవండి: పిల్లలలో కడుపు నొప్పిని తగ్గించే బెస్ట్ హోం రెమెడీస్ ఇవే..!!
పుస్తక సమీక్ష:
పిల్లలు చదివిన పుస్తకం గురించి ప్రతిరోజూ వారితో డిస్కస్ చేయండి. వారు చదివిన టాపిక్ పై ప్రశ్నలు అడుగుతుందండి. వారు పుస్తకాన్ని ఎలా ఇష్టపడుతున్నారో తెలుసుకోండి. వీలైతే..మీరు కూడా వారితో కూర్చోని చదువుతుంటే వారికి మరింత ఆసక్తి పెరుగుతుంది. పిల్లలు వినడం కంటే మిమ్మల్ని అనుకరించడం వల్లే ఎక్కువగా నేర్చుకుంటారు. దీని కారణంగా వారి పదజాలం కూడా మెరుగవుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. పఠన వేగం పెంచుతారు. ఇది అధ్యయనాల సమయంలో చాలా సహాయపడుతుంది. అదేవిధంగా టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రమేయాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు దోహదపడుతుంది.