Puri Akhad: డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannad) ..డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్… ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన కుమారుడు ఆకాష్ పూరి (Akash Puri) వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయాడు. కానీ తొలిసారి ఆర్సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా ఉన్నాడు.
ఏపీ, తెలంగాణలో ఆర్సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంది. ఈ క్లాత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా ఆనందంగా ఉందని ఆకాష్ చెప్పుకొచ్చాడు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంచ్ కార్యక్రమంలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులైన రోమన్, రమేష్ తో కలిసి ఆకాష్ పూరి పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ… మొదట ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని నన్ను కలిసినప్పుడు అసలు నేను దీనికి ప్రచారకర్తగా చేయడం కరెక్ట్ ఆ కాదా అని ఆలోచించాను. ఎందుకంటే నేను బ్రాండెడ్ దుస్తులు ఎక్కువగా ధరించను. అలాంటి నన్ను వీరు ఎంపిక చేసుకోవడంతో పాటు వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి వివరించిన తరువాత అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకు వచ్చాను.
నేను చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ కంపెనీ ఇదే కావడంతో చాలా హ్యాపీగా ఉంది. బ్రాండ్ కు మేము ఇచ్చిన అనౌన్స్ మెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు మరికొన్ని బ్రాండింగ్స్ కు కూడా అంబాసిడర్ గా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. ఈసారి నుంచి సినిమాల విషయం లో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంది.
ప్రస్తుతం కొన్ని సినిమాలను ఫైనలైజ్ చేసే పని లో ఉన్నాను. నాన్న డైరెక్షన్ లో మాత్రం నటించకూడదని అనుకుంటున్నాను. నాకు నేనుగా పేరు తెచ్చుకున్న తరువాతే ఆయన డైరెక్షన్ సినిమాలో నటిచేందుకు నిర్ణయం తీసుకుంటాను.నాకు తల్లిదండ్రుల ఇద్దరి సపోర్ట్ ఉంది.
ఇండస్ట్రీలో కార్తీకేయ 2, హనుమాన్ వంటి సినిమాలు చూసిన తరువాత అలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇక ప్రేమ విషయానికి వస్తే… ప్రస్తుతానికి నేను సింగిల్ .. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు అంటూ పూరి ఆకాష్ చెప్పుకొచ్చాడు.
Also read: మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా..అయితే మీ పిల్లలకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లే!